BFSI కోర్సులకు నేడే శ్రీకారం.. ప్రారంభించనున్న సీఎం, మంత్రి..!

-

ప్రస్తుతం చదువుతున్న చదువుకు.. చేస్తున్న జాబ్ కు ఎలాంటి సంబంధం లేదని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. జాబ్ కు అనుగుణంగా సిలబస్ తయారు చేసి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి మాసబ్ ట్యాంక్ లోని జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో BFSI కోర్సులను ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 38 కళాశాలల్లో బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సెక్టార్ లో నైపుణ్య శిక్షణ అందించే కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. 18 ఇంజినీరింగ్ మరో 20 డిగ్రీ కళాశాలలను ఎంపిక చేశారు. ఐదు వేల మంది బీటెక్, మరో 5 వేల మంది డిగ్రీ విద్యార్థులకు ఈ కోర్సులు నేర్పించనున్నారు.

అదేవిధంగా బీటెక్ సెకండ్, థర్డ్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారికి ఇందులో శిక్షణ అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  BFSI కోర్సులను అందించేందుకు డిగ్రీలో హైదరాబాద్ లో 12 కాలేజీలను సెలెక్ట్ చేశారు. వాటిలో కోఠి ఉమెన్స్ కాలేజీ, నిజాం కాలేజీ,  సిటీ కాలేజ్,  భవన్స్ డిగ్రీ కాలేజీ, ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీ, బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్, సెయింట్ ఆన్స్, సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్ పీఎస్ఎక్స్ కాలేజ్ లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version