వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ జరుగనున్న తరుణంలో బీసీసీఐకి ఊహించని షాక్ తగిలింది. కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్ లోని ఫాల్స్ సీలింగ్ లో మంటలు చెలిరేగాయి. ఈ ఘటనలో డ్రెస్సింగ్ రూమ్ లోని అనేక పరికరాలు బూడిదయ్యాయి.
ఈ ఘటనకు గల కారణాలపై క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ దర్యాప్తునకు ఆదేశించింది. మరోవైపు అక్టోబర్ 5 నుంచి జరగనున్న వన్డే వరల్డ్ కప్ లో 5 మ్యాచ్లకు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ జరుగనున్న తరుణంలో అగ్ని ప్రమాదం జరుగడంపై అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.