BREAKING : మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

-

మరోసారి గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిన ధర.. ఐదు రాష్ట్రాల పోలింగ్ ముగిసిన మరుసటి రోజే పెరగడం గమనార్హం. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.21 పెరిగినట్లు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్​లో మార్పులకు అనుగుణంగా ఈ మేరకు ధరలు సవరించినట్లు చెప్పాయి. గృహ అవసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని వెల్లడించాయి. ఈ వార్తతో సామాన్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

 

అయితే వ్యాపారులు మాత్రం గ్యాస్ ధర గుదిబండగా మారుతోందని వాపోతున్నారు. హోటల్స్, రెస్టారెంట్స్​ సహా ఇతర వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కిలోల గ్యాస్ బండ ధర ఇప్పటివరకు దిల్లీలో 1,775.50గా ఉండగా.. తాజా పెంపుతో అది రూ.1,796.50కు చేరినట్లు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి. విమానాల్లో ఇంధనంగా ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్-ఏటీఎఫ్​ ధర 4.6శాతం మేర తగ్గినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు వెల్లడించాయి. ఇప్పటివరకు దిల్లీలో కిలోలీటరుకు 1,11,344.92 రూపాయలుగా ఏటీఎఫ్ ధర ఉండగా తాజాగా 1,06,155.67 రూపాయలకు తగ్గినట్లు వివరించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version