ఉజ్వల స్కీమ్ కింద ఒక్కో సిలిండర్ పై అదనంగా మరో రూ.200 సబ్సీడీ అందించనున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 01 నుంచి తగ్గిన ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే సాధారణ సామాన్యులకు మరో అదిరిపోయే శుభవార్త.
ఇటీవల కాలంలోనే గృహ వినియోగ సిలిండర్ ధరలను కేంద్రం తగ్గించగా…. చమురు సంస్థలు తాజాగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కూడా తగ్గించాయి. వరుసగా మూడో నెల భారీగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గగా… తాజాగా 157.50 మేర తగ్గించాయి. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర 1680 రూపాయల నుంచి 152 కు చేరుకుంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు చమురు సంస్థలు.