రివ్యూ: ఐదేళ్ల నిరీక్షణకు.. ఖుషి సినిమాతో చెక్ పెట్టిన విజయ్ దేవరకొండ..!!

-

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి చిత్రం ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్వహణ దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కంటే ముందుగా USA లో ప్రీమియం షో లు పడడం జరిగింది. అక్కడ కూడా ఈ సినిమాకి ప్రేక్షకులు పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరిగింది. మరి భారీ అంచనాలు మధ్య విడుదలైన ఖుషి సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో తెలుసుకుందాం.

ఖుషి చిత్రంలో సమంత ,విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని.. మార్నింగ్ షో నుంచి పాజిటివ్ టాక్ ఏర్పడడంతో విజయ్ దేవరకొండ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ,సాంగ్స్ కూడా సూపర్ హిట్టుగా నిలిచాయి.. స్క్రీన్ మీద సమంత ,విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ కూడా చాలా అద్భుతంగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

డైరెక్టర్ మజిలీ, నిన్ను కోరు వంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న శివ ఖుషి సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

మరొక నేటిజన్ విజయ్ దేవరకొండ హిట్టు కోసం ఎదురుచూసిన చూపులకు తగిన ఫలితం దక్కిందని ఐదేళ్ల తర్వాత భారీ హిట్ కొట్టారని బ్లాక్ బస్టర్ సినిమాకు ఏమాత్రం తగ్గని ఖుషి సినిమా మరొకసారి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

ఏది ఏమైనా విజయ్ దేవరకొండ నటన సమంత యాక్టింగ్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నట్లు తెలుస్తోంది. చివరి 30 నిమిషాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందట..చివరిగా పాన్ ఇండియా లెవెల్ లో లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ని అందుకున్న విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version