ఈ నెల 4 నుంచి గేట్‌ పరీక్షలు.. షెడ్యూల్‌ విడుదల

-

ది గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్)-2023 పరీక్షలను ఈసారి ఐఐటీ కాన్పూర్‌ నిర్వహిస్తోంది. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఆ షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో గేట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో జరుగుతుంది.

 

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా వారి అడ్మిట్‌ కార్డులతో రావాల్సి ఉంటుంది. అడ్మిట్‌ కార్డులు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఈ అడ్మిట్ కార్డులను ఇంతకుమునుపే జనవరి 9వ తేదీని జారీ చేశారు. అభ్యర్థులు అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ఈ కింది ప్రక్రియను అనుసరించాలి.

ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ gate.iitk.ac.in ను ఓపెన్‌ చేయాలి.
2. హోమ్‌ పేజీలోని నోటిఫికేషన్‌ సెక్షన్‌లో ‘GATE 2023 Admit Card’ అని ఉన్న లింక్‌పై క్లిక్‌ చేయాలి.
3. క్లిక్‌ చేయగానే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
4. అందులో మీ లాగిన్‌కు సంబంధించిన వివరాలను పొందుపర్చి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
5. ఇలా డౌన్‌లోడ్‌ చేసిన అడ్మిట్‌కార్డులను ప్రింట్‌వుట్‌ తీసుకోవాలి. అడ్మిట్‌ కార్డు లేకుండా అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతించరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version