ఈ నెల 6న దిల్లీ మేయర్‌ ఎన్నిక.. ఆప్‌, బీజేపీ గొడవ వల్ల రెండుసార్లు నిలిపివేత

-

ఆప్‌, బీజేపీ మధ్య గొడవల వల్ల రెండు సార్లు నిలిచిపోయిన దిల్లీ మేయర్ ఎన్నికకు మరోసారి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 6న దిల్లీ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నారు.  దీని కోసం సభ్యుల సమావేశానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అంగీకరించారు. ఫిబ్రవరి 3,4,6 తేదీలను దిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం సూచించగా ఆరో తేదీని ఖరారు చేశారు.

మరోవైపు దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలిచిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), పీఠం నుంచి దిగిన బీజేపీ మధ్య పోరు కొనసాగుతోంది. దీని వల్ల మేయర్‌ ఎన్నిక రెండుసార్లు ఆగిపోయింది. జనవరి 6, 24 తేదీల్లో మేయర్‌ ఎన్నిక కోసం సభ్యులు సమావేశమయ్యారు. అయితే ఎంసీడీ ఎన్నికల్లో ఓడిన బీజేపీ కూడా మేయర్‌ పీఠం కోసం కుయుక్తులు పన్నడంతో ఇరు పార్టీల సభ్యుల మధ్య ఘర్షణ జరిగి మేయర్‌ ఎన్నిక రెండుసార్లు నిలిచిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version