ప్రియుడిని కోర్టుకీడ్చిన ప్రియురాలు..!

-

ఎనిమిదేళ్లుగా ఆ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వీళ్లిద్దరి విషయం ఇంట్లో అందరికీ తెలుసు. పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఆమె అతనికి.. అతను ఆమెకు మెసేజ్ లే మెసేజ్ లు. ఆఫీసులో ఉన్నా.. కొలిగ్స్ తో ఉన్నా.. వారి ధ్యాస వారిదే. వారి ఎనిమిదేళ్ల డేటింగ్ కు ప్రతిరూపంగా ఒక సంతానం కూడా ఉంది. ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్లి పీటలు ఎక్కాలని నిశ్చయించుకుంది ఆ యువతి. పెళ్లి చేసుకుందామని అతడిని అడిగింది. కానీ అతడు మాత్రం ఆ యువతికి ఊహించని షాకిచ్చాడు. పెళ్లి చేసుకోవడం కుదరదన్నాడు.

ఎందుకు కుదరదో తేల్చుకుందామని ఆ యువతి కోర్టు మెట్లెక్కింది. వివరాల్లోకి వెళ్తే జాంబియాకు చెందిన గెట్రూడె గోమా అనే యువతి ఎనిమిదేళ్లుగా హర్బర్ట్ సలైకీతో డేటింగ్ లో ఉంది. అతడు భవిష్యత్ లో పెళ్లి చేసుకుంటా అని నమ్మించడంతో అతడికి సర్వస్వం సమర్పించింది. వారి ఎనిమిదేళ్ల డేటింగ్ కు గుర్తుగా ఒక సంతానం కూడా ఉంది. అయితే పెళ్లి గురించి అడిగినప్పుడల్లా సలైకీ మాత్రం ఏదో కారణం చెప్పి తప్పించుకునేవాడు. అయితే తనకు కోరికపుట్టినప్పుడల్లా గోమా దగ్గరికి వచ్చి మభ్యపెట్టి అవసరం తీర్చుకుని వెళ్లేవాడు.

ఇప్పటికే ఎనిమిదేళ్లుగా ప్రేమ అంటూ అందరికీ తెలిసేలా తిరిగాం. ఒక బిడ్డకు తల్లిదండ్రులు కూడా అయ్యాం. అయినా పెళ్లి విషయానికి వచ్చేసరికి సలైకీ సమాధానం దాటవేయడంతో ఆమె అమీతుమీకి రెడీ అయ్యింది. పెళ్లి చేసుకుంటావా..? లేదా..? అని నిలదీసింది. దీంతో సలైకీ అసలు విషయం చెప్పాడు. తనకు కట్నం కావాలని అడిగాడు. తాను అడిగినంత కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పాడు. ఇదంతా డేటింగ్ లో ఉన్నప్పుడు చెప్పలేదని అడిగితే.. అప్పడా అవసరం రాలేదని చెప్పాడు సలైకీ. ఆ పై ఆమెకు బ్రేకప్ చెప్పేశాడు.

ఇదంతా విన్న ఆ యువతి.. కోర్టును ఆశ్రయించింది. డేటింగ్ పేరుతో తనను మోసం చేశాడని.. ఒక సంతానం కూడా కలిగిన తర్వాత.. కట్నం కావాలని డిమాండ్ చేస్తున్నాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని అర్థించింది. బాధితురాలి పిటీషన్ ను విచారణకు స్వీకరించింది కోర్టు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించి విచారణను ప్రారంభించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version