తెలంగాణలో నేటి నుండి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ లు మొదలు కానున్నాయి. మూడు నెలలుగా రిజిస్ట్రేషన్ లు ఆగిపోగా మరలా ఈరోజు నుండి మొదలు కానున్నాయి. పాత విధానంలోనే ఈ రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. హై కోర్ట్ ఆదేశాలను అమలు చేయాలని సీఎం ఆదేశించడంతో ఈ రిజిస్ట్రేషన్లు మొదలు కానున్నాయి. ఇక ధరణి పోర్టల్ పై హైకోర్టులో విచారణ జరిగింది.
రిజిస్ట్రేషన్ లపై స్టే ఇవ్వలేదని మరోసారి స్పష్టం చేసిన హైకోర్టు పాత పద్దతిలో రీజిస్ట్రేషన్ చేస్తే మాకేం అభ్యంతరం లేదని పేర్కొంది. రిజిస్ట్రేషన్ గతంలో CARD పద్దతిలో జరిగాయి. అదే పద్దతి కొనసాగించాలన్న పిటీషన్ తరపు న్యాయవాదులు కోరగా ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ గతంలో లాగా రిజిస్ట్రేషన్ చేసుకునే విదంగా చూడాలని అడ్వొకేట్ జనరల్ కూడా కోరారు.