పర్సులో 65 వేలు ఉన్నా ఆశ పడలేదు…!

-

రోడ్డుపై ఏదైనా పర్సు దొరికితే అందులో వెయ్యి రూపాయలు ఉన్నా వంద రూపాయలు ఉన్నా తీసుకుని అక్కడ పడేస్తారు కొందరు. అలాంటి వారికి ఒక వ్యక్తి ఆదర్శం అయ్యాడు. మరో వ్యక్తి పోగొట్టుకున్న వాలెట్ ని తిరిగి తెచ్చి ఇచ్చాడు. కొచ్చిలోని నావల్ షిప్ రిపేర్ యార్డ్‌లో ఉద్యోగిగా ఉన్న పి.కె. సుధాకర్ణం బుధవారం రోడ్డుపై వాలెట్‌ ను కనుగొన్నారు. వాలెట్‌లో రూ .65 వేలు ఉన్నాయి.

money invest

వెంటనే ఆ వాలెట్‌ను పనాంగాడ్ పోలీస్ స్టేషన్‌ కు తీసుకెళ్లాడు. ఆటోరిక్షా డ్రైవర్ అయిన వాలెట్ యజమానిని పోలీసులు గుర్తించారు. వాలెట్ ఒక రోజు తరువాత డ్రైవర్ కు తిరిగి ఇచ్చారు. సుధాకరన్ నిజాయితీ కథ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతని నిజాయితీ ప్రవర్తనకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆటో డ్రైవర్ కు అతను కష్టపడి సంపాదించిన డబ్బు చెక్కుచెదరకుండా వచ్చిందని కామెంట్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version