కేదార్నాథ్ లో పెను ప్రమాదం చేసింది. కేదార్నాథ్ లో హెలికాప్టర్ కు ప్రమాదం జరిగింది. ఎయిమ్స్ రిషికేశ్ హెలికాప్టర్ అంబులెన్స్ సర్వీస్ నడుస్తోంది. సాంకేతిక లోపంతో హెలికాఫ్టర్ ను ఎమర్జెన్సీగా ల్యాండ్ చేసాడు పైలెట్. ఉత్తరాఖండ్ ఎయిమ్స్ ఎయిర్ అంబులెన్స్ గా గుర్తించారు.

ఎమర్జెన్సీ ల్యాండింగ్ తో వెనుక భాగం నేలను బలంగా ఢీకొట్టడంతో హెలికాప్టర్ వెనుక భాగం దెబ్బతిన్నది. ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఉన్న ముగ్గురు ,(ఒక వైద్యుడు, ఒక కెప్టెన్, ఒక వైద్య సిబ్బంది) సురక్షితంగా ఉన్నారు. ఈ విషయాన్నీ గర్హ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ విషయాన్ని గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.