సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌తో ఢిల్లీలో హైఅలర్ట్..!

-

High alert in Delhi with CM Kejriwal’s arrest : ఢిల్లీలో హై అలర్ట్. సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌తో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఈ తరుణంలోనే ఢిల్లీ నగరం మొత్తం భారీగా పోలీసులు.. మోహరించారు. ఆప్‌ కార్యకర్తల ఆందోళనలతో అప్రమత్తమయ్యాయి భద్రతా బలగాలు.

High alert in Delhi with CM Kejriwal’s arrest

ఈడీ కార్యాలయం, కేజ్రీవాల్ నివాసానికి వెళ్లే అన్ని మార్గాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.. కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. దీంతో ఇవాళ మధ్యాహ్నం కోర్టులో హాజరుపర్చనున్నారు ఈడీ అధికారులు. కాగా, అరవింద్‌ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఆయన అధికార నివాసంలో అరెస్టు చేసింది. అంతకుముందు అక్కడ సోదాలు నిర్వహించడంతో పాటు కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు.

అనంతరం అదుపులోకి తీసుకుని దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. 2012లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కన్వీనర్‌గా ఉంటున్న కేజ్రీవాల్‌ ఇప్పటివరకు మూడుసార్లు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. లోక్‌సభ ఎన్నికల ముంగిట ఆయన అరెస్టు కావడం వల్ల వారసత్వ పగ్గాలు కొంత సంక్లిష్టంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version