అవినీతిపై CVC రిపోర్టు.. ఆ శాఖ ఉద్యోగులపైనే అత్యధిక ఫిర్యాదులు

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులను కేంద్ర విజిలెన్స్ కమిషన్ నివేదిక వెల్లడించింది. గతేడాదిలో వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి నివేదికను తాజాగా వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. అత్యధికంగా హోం మంత్రిత్వ శాఖలోనే అవినీతి ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడైంది. తర్వాతి స్థానాల్లో భారతీయ రైల్వే, బ్యాంకులు ఉన్నాయని తేలింది.

గతేడాది కేంద్రంలో అన్ని విభాగాలకు సంబంధించి 1,15,203 ఫిర్యాదులు అందినట్లు సీవీసీ వెల్లడించింది. వాటిలో 85,437 ఫిర్యాదులను పరిష్కరించగా.. మరో 29,766 పెండింగులో ఉన్నట్లు తెలిపింది. ఇందులో 22,034 ఫిర్యాదులు మూడు నెలలకుపైగా పెండింగులో ఉన్నట్లు పేర్కొంది. గతేడాది హోంశాఖ ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు అత్యధికంగా 46,643 ఫిర్యాదులు అందాయని సీవీసీ వివరించింది.

సీవీసీ నివేదిక ప్రకారం.. రైల్వే ఉద్యోగులపై 10,850, బ్యాంకులపై 8,129 ఫిర్యాదులు.. దిల్లీలో పనిచేసే ఉద్యోగులపై 7,370 , బొగ్గు శాఖలో 4,304, కార్మిక శాఖలో 4,236, పెట్రోలియం శాఖలో 2,617 ఫిర్యాదులు అందాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ లో 2,150, రక్షణ శాఖలో 1,619 ఫిర్యాదులు వచ్చాయని సీవీసీ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version