ఇల్లు లేని వారు ఎన్ని కష్టాలు పడుతున్నారో మనం చూస్తూ ఉంటాం. చాలా నరకం చూసే పరిస్థితి. తినడానికి తిండి లేకపోయినా సరే ఇల్లు కట్టుకోవడానికి ప్రతీ పైసా కూడా పోగు చేసుకుంటూ ఉంటారు. ఇంటి కోసం జనాలు పడే కష్టాలు మనం చూస్తాం. అలాంటి ఇల్లు కళ్ళ ముందు పడిపోతుంటే ఏం చేస్తారు…? అలా చూడటమే. మన చేతిలో చేసేది ఏమీ లేదు. ఒడిశాలో ఇలాంటిది ఒక ఘటన జరిగింది.
భారీ వర్షాల వల్ల ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా మధుబన్‌లో రెండు అంతస్తుల భవనం కళ్ళ ముందు కూలింది. ఈఇక్కడ అసలు విషయంలోకి వెళ్తే… ఆ భవనం కూలే సమయంలో ఇంటి సభ్యులందరూ బయటకు వచ్చారు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి వీడియో కూడా రికార్డ్ చేసారు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను కూడా తెచ్చుకోలేకపోయారు అక్కడ ఉన్న వారు.
A two-storey building collapses following incessant rain at Madhuban Tala Sahi in Baripada of Mayurbhanj district. No injury or casualty reported #Odisha pic.twitter.com/71NVVyR3C7
— OTV (@otvnews) August 26, 2020