వారణాసి ఎయిర్ పోర్ట్ లో భారీగా అక్రమ బంగారం పట్టివేత

-

స్మగ్లింగ్ కు కస్టమ్స్ అధికారులు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే ఉన్నా.. స్మగ్లర్లు మాత్రం కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు. కొత్త కొత్త మార్గాల్లో బంగారాన్ని విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారు.తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో భారీగా అక్రమ బంగారం పట్టుకున్నారు అధికారులు.షార్జా ప్రయాణీకుడి వద్ద 1 కోటి 22 లక్షల విలువ చేసే 2.33 కేజీల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు.

బంగారాన్ని తరలించడానికి కొత్త కొత్త పద్దతులు వెతుకుతున్న స్మగ్లర్స్.ఈసారి బంగారు బిస్కట్ లను నల్లటి టేప్ లో ప్యాకింగ్ చేసి నడుముకు బెల్టుగా తయ్యారు చేసాడు కేటుగాడు. బంగారం తో ఉన్న బెల్టును నడుముకు చుట్టి తరలించే యత్నం చేశాడు. ప్రయాణీకుడి ముసుగులో బంగారాన్ని తరలించే ప్రయత్నాన్ని భగ్నం చేసింది కస్టమ్స్ బృందం. నడుము భాగంలో దాచిన బంగారాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version