భారీగా తగ్గిన గ్యాస్ సబ్సిడీ..!

-

భారీగా గ్యాస్ సబ్సిడీ తగ్గిపోయింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చెల్లించే గ్యాస్ సబ్సిడీ ఇప్పుడు బాగా తగ్గింది. 2022లో మొదటి తొమ్మిది నెలల కాలంలో కంపెనీలు చెల్లించిన గ్యాస్ సబ్సిడీ రూ.2,706 కోట్లకు తగ్గింది. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

gas

2019 ఆర్థిక సంవత్సరంలో రూ.37,585 కోట్లుగా ఉందని ఆర్‌టీఐ క్వరీ లో తెలిసింది. అలానే గత ఐదేళ్లలో దేశీయ గ్యాస్ కంపెనీలు వినియోగదారులకు ఏ మేర సబ్సిడీ అందించాయో తెలిపాలని అన్నారు. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ రిటైల్ ధరలను పెంచుతోన్న ప్రభుత్వం తనపై ఉన్న రాయితీ భారాన్ని తగ్గించుకుంటోంది.

వంట గ్యాస్‌ను ప్రస్తుతం 39 కోట్ల మందికి పైగా వాడుతున్నారు. అయితే ఆయిల్, గ్యాస్ ధరలు గ్లోబల్ గా తగ్గాయి. అయితే ఈ సమయం లో ప్రభుత్వం ధరలను కూడా పెంచడం జరిగింది. ఫ్యూయల్ ధరలు అయితే ఇప్పుడు బాగా పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ ప్రభావంతో అంతర్జాతీయంగా గ్యాస్ సప్లయిలో అంతరాయాలు వస్తున్నాయి.

అయితే మరి ధరలు ఎలా వుంటాయో అని ప్రజలు భయపడుతున్నారు. 2018-19లో ఆర్‌టీఐ సమాధానంలో మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సబ్సిడీ కింద రూ.37,585 కోట్లను చెల్లించాయి. అయితే డిసెంబర్ నాటికి రూ.2,706 కోట్లకు దిగొచ్చాయని ఆర్‌టీఐ అంది.

గత ఐదు ఏళ్ల నుండి చూస్తే గ్యాస్ 100 శాతం మేర పెరిగింది. గ్యాస్‌పై ఉన్న సబ్సిడీని కూడా తగ్గించిందని అన్నారు. సిలెండర్ ధర ఇప్పుడైతే సుమారు రూ.900గా ఉంది. కానీ సబ్సిడీ కేవలం రూ.40.10 మాత్రమేనని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version