దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని పలు విభాగాల్లో.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) మొత్తం 1402 స్పెషల్ ఆఫీసర్ పోస్టుల నియామకాలను చేపట్టనున్నట్లు తెలిపింది. కేటగిరీల ఆధారంగా పోస్టులను కేటాయించిన ఈ భర్తీ ప్రక్రియకు సంబంధించి దరఖాస్తులను ఈనెల 1 నుంచి స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది.
పోస్టులు వారీగా ఖాళీలు..
- ఐటీ ఆఫీసర్- 120
- అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్(ఏఎఫ్ఓ)- 500
- రాజ్‌భాషా అధికారి- 41
- లా ఆఫీసర్- 10
- హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్- 31
- మార్కెటింగ్ ఆఫీసర్(ఎంఓ)- 700
దరఖాస్తుకు ఈనెల 21న గడువు ముగియనుంది. ఐబీపీఎస్.. ప్రిలిమ్స్ డిసెంబర్ 30,31వ తేదీల్లో నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 28న జరగనుంది. ఈ పరీక్షకు దరఖాస్తు రుసుము.. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు- 850.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు- 175/ ఉంది. అభ్యర్థుల వయసు 20-30 ఏళ్లలోపు ఉండాలి.