బ్యాంకుల్లో ఏవేవో స్కీమ్స్ ఉంటాయి. అవి అన్నీ కష్టర్లకు తెలియదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ల కోసం పలు రకాల పథకాలను ప్రారంభిస్తూ ఉంటుంది. వాటిలో కొన్ని పాపులర్ స్కీమ్స్ ఉంటాయి. ఎస్‌బీఐ ప్రారంభించే పథకాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ కూడా ఉంటాయి. ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌లో సాధారణ ఎఫ్‌డీ పథకాల కన్నా ఎక్కువ వడ్డీ లభిస్తూ ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఓ స్కీమ్ ఆగస్ట్ 15తో ముగుస్తుంది. ఈ స్కీమ్‌లో చేరితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం.!
ఈ స్కీమ్ పేరు అమృత్ కలష్ డిపాజిట్ స్కీమ్ (Amrit Kalash Deposit Scheme) ఒకటి. ఈ స్కీమ్ బాగా పాపులర్ అయింది. దీంతో ఈ పథకం గడువును పొడిగించింది ఎస్‌బీఐ. ఖాతాదారులకు ఈ పథకంలో చేరడానికి మరిన్ని రోజులు అవకాశం లభించింది. మొదట ఎస్‌బీఐ అమృత్ కలష్ డిపాజిట్ స్కీమ్ 2023 మార్చి 31 వరకే ఉంటుందని ఎస్‌బీఐ ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని రోజులు ఈ పథకం అందుబాటులో లేదు. అయితే కస్టమర్ల నుంచి మంచి స్పందన రావడంతో ఈ పథకాన్ని ఏప్రిల్‌లో రీలాంఛ్ చేసింది. అప్పుడు 2023 జూన్ 30 వరకే గడువు విధించింది. ఇటీవల ఈ గడువును 2023 ఆగస్ట్ 15 వరకు పొడిగించింది. ఆ తర్వాత ఈ స్కీమ్‌ను పొడిగిస్తుందో లేదో తెలియదు.
ఎస్‌బీఐ అమృత్ కలష్ డిపాజిట్ స్కీమ్ విశేషాలు
ఈ స్కీమ్ 400 రోజుల గడువుతో వస్తుంది. ఈ స్కీమ్‌లో సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, ఇతరులకు 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌లో ఇంతకన్నా తక్కువ వడ్డీ లభిస్తుంది కాబట్టి, కస్టమర్ల నుంచి అమృత్ కలష్ పథకాన్ని మంచి స్పందన వస్తోంది. భారతీయ కస్టమర్లతో పాటు ఎన్ఆర్ఐ కస్టమర్లు కూడా ఈ పథకంలో చేరొచ్చు.
ఏడాది నుంచి 2 ఏళ్ల లోపు సీనియర్ సిటిజన్లకు 7.3 శాతం వడ్డీ, ఇతరులకు 6.8 శాతం వడ్డీ, 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల లోపు సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ, ఇతరులకు 7 శాతం వడ్డీ, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు సీనియర్ సిటిజన్లకు 70 శాతం వడ్డీ, ఇతరులకు 6.5 శాతం వడ్డీ, 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల లోపు సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ, ఇతరులకు 6.50 శాతం వడ్డీ లభిస్తుంది.
ఇక ఎస్‌బీఐలో సాధారణ వడ్డీ రేట్లు చూస్తే 7 రోజుల నుంచి 45 రోజులకు సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం వడ్డీ, ఇతరులకు 3 శాతం వడ్డీ, 46 రోజుల నుంచి 179 రోజులకు సీనియర్ సిటిజన్లకు 5 శాతం వడ్డీ, ఇతరులకు 4.5 శాతం వడ్డీ, 180 రోజుల నుంచి 210 రోజులకు సీనియర్ సిటిజన్లకు 5.75 శాతం వడ్డీ, ఇతరులకు 5.25 శాతం వడ్డీ, 211 రోజుల నుంచి 1 ఏడాది లోపు సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీ, ఇతరులకు 5.75 శాతం వడ్డీ లభిస్తుంది.