LPG గ్యాస్ సిలిండర్ వాడే వారికి గుడ్ న్యూస్..!

-

ఎంతో మంది గ్యాస్ సిలిండర్ ని ఉపయోగిస్తారు. గ్యాస్ సిలెండర్ వలన వంటకి ఇబ్బంది అవ్వదు. పైగా త్వరగా వంట కూడా పూర్తి అయ్యిపోతుంది. అయితే మీకు గ్యాస్ సిలిండర్ ఉందా..? అయితే తప్పక మీరు దీని గురించి తెలుసుకోవాలి. సాధారణంగా మనం గ్యాస్ సిలెండర్ ని ఉపయోగిస్తున్నప్పుడు గ్యాస్ అనేది ఏదో ఒక రోజు అయ్యిపోతుంది. అప్పుడు మళ్ళీ మరో సిలెండర్ ని బుక్ చెయ్యాలి.

gas

మీ సిలెండర్ కూడా అయిపోయిందా..? అందుకే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలని ఆలోచిస్తున్నారా…? అయితే మీకు శుభవార్త. మీ కోసం ఒక ఆఫర్ వుంది. మరి ఇక దాని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ ఆఫర్ లో భాగంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారికి తగ్గింపు లభిస్తుంది. అది ఎలా అనేది చూస్తే… ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌పై తగ్గింపు ఆఫర్ ని ఇస్తోంది.

దీనితో మీరు మీ డబ్బుని ఆదా చెయ్యచ్చు. పాకెట్స్ యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే.. రూ.50 తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ సహా ఇతర బిల్లుల చెల్లింపుపై 10 శాతం తగ్గింపు కూడా పొందొచ్చు. గరిష్టంగా రూ.50 క్యాష్‌బ్యాక్ వస్తుంది.

అయితే కనీసం రూ.200 లేదా ఆపైన లావాదేవీలు చెయ్యాల్సి ఉంటుంది. అదే విధంగా నెలలో మూడు బిల్లుల చెల్లింపునకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది గమనించండి. పాకెట్స్ యాప్‌లోకి వెళ్లి.. రీచార్జ్ అండ్ పే బిల్స్ అనే సెక్షన్‌లోకి వెళ్లి… తర్వాత బిల్లర్ ఎంచుకొని బిల్లు చెల్లించాలి అంతే.

Read more RELATED
Recommended to you

Exit mobile version