‘మే’లోనూ మంట తప్పదు.. గరిష్ఠ ఉష్ణోగ్రతలపై ఐఎండీ ప్రకటన

-

ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ నెలలోనూ మంట తప్పదని వాతావరణ శాఖ వెల్లడించింది. భారత్లోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఉత్తర మైదానాలు, మధ్య భారతంతోపాటు భారత ద్వీపకల్పం పరిసర ప్రాంతాల్లో ఎక్కువ రోజులు గణనీయమైన వేడిగాలులు ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చీఫ్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర పేర్కొన్నారు.

ఏప్రిల్‌ నెలలోనూ తూర్పు, వాయవ్య భారతం తదితర ప్రాంతాలను సుదీర్ఘమైన వేడి వాతావరణం ఉక్కిరిబిక్కిరి చేసిన విషయం తెలిసిందే. వేడిగాలుల ఉద్ధృతి మే నెలలోనూ కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ రాజస్థాన్‌, పశ్చిమ మధ్యప్రదేశ్‌, విదర్భ, మరాఠ్వాడా, గుజరాత్‌ ప్రాంతాల్లో ఈ వాతావరణం దాదాపు 8 నుంచి 11 రోజులు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోని మిగతా ప్రాంతాలు, పంజాబ్‌, హరియాణా, చండీగఢ్‌, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, అంతర్గత ఒడిశా, గంగాతీరంలోని పశ్చిమబెంగాల్‌, ఝార్ఖండ్‌, బిహార్‌, ఉత్తర అంతర్గత కర్ణాటక, తెలంగాణాల్లో మే నెల అయిదు నుంచి ఏడు రోజులు వేడి వాతావరణ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version