దేశవ్యాప్తంగా యూసీసీ అమలు సాధ్యం కాదు : డీకే శివకుమార్

-

దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి అమలు అసాధ్యం అని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అభిప్రాయపడ్డారు. భారత్ లోని భిన్నత్వం కారణంగా అది కుదరదని కొట్టి పారేశారు. ప్రతీ పౌరుడికి తన వ్యక్తిగత జీవితం ఉంటుంది. మొత్తం దేశమంతా అమలు చేసేందుకు ఇది కుదరదని చట్టాన్ని రాష్ట్రంలో మాత్రం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు డీ.కే.శివకుమార్. ఒకవేళ యూసీసీ అమలు అయితే పౌరులందరికీ ఒకే పౌరస్మృతి అమలులోకి వస్తుందనే విషయం తెలిసిందే. 

ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్ లో యూసీసీ అమలులోకి వచ్చింది. యూసీసీ కి సంబంధించిన నోటిఫికేషన్, విధి, విధానాలను తన అధికారిక నివాసం అయిన ముఖ్య సేవక్ సదన్ లో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఇటీవలే ఆవిష్కరించారు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచిందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version