వాట్ ఇండియా థింక్స్ టుడే పవర్ కాన్ఫరెన్స్‌లో హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు యూనిఫాం సివిల్ కోడ్ పై కీలక విషయాలు వెల్లడించారు. ఎన్నికల తర్వాత దేశంలో UCC అమలు చేస్తామన్నారు. UCC కొంతమందికి రాజకీయ సమస్య కావచ్చు అని.. అయితే ఇది ఒక సామాజిక సంస్కరణ అని నొక్కి చెప్పారు అమిత్‌షా. దేశంలో ఏ మతం ప్రాతిపదికన చట్టం ఉండకూడదని అభిప్రాయపడ్డారు. దేశం చట్టాలు నేటి పరిస్థితులకు అనుగుణంగా, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలన్నారు. తగిన సమయంలో ఒకే విధమైన పౌర చట్టాన్ని తీసుకురావాలని మన రాజ్యాంగ అధికరణ 44 సూచిస్తుందన్నారు అమిత్‌షా.
ఉత్తరాఖండ్ లో యూసీసీని అమలుపైపా అమిత్‌షా స్పందించారు. దీనిపై సామాజిక, న్యాయ, చట్టబద్ధమైన పరిశీలన జరగాలని.. ఇది చాలా పెద్ద చట్టమన్నారు. ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల్లో యూసీసీని అమలు చేస్తామన్నారు. ఉత్తరాఖండ్‌లో దీన్ని మొదటిగా తీసుకురావడంపై అమిత్ షా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పెద్ద సంస్కరణ అని, యుసీసీపై విస్తృత చర్చ జరగాలన్నారు. ఆపై దేశంలో దీనిని అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. యూసీసీని హిందూ కోడ్ బిల్లుగా పేర్కొంటూ.. కొందరు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అమిత్ షా ఫైర్ అయ్యారు.