2024 జనవరి 31 తర్వాత కొన్ని ఫాస్టాగ్స్ పని చేయకపోవచ్చు. అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉన్నా.. కేవైసీ చేయించుకోని ఫాస్టాగ్ అకౌంట్స్‌ని సంబంధిత బ్యాంక్‌లు డీయాక్టివేట్ చేసేస్తాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఒక వాహనానికి అనేక ఫాస్టాగ్స్ ఉంటున్నాయి. లేదా చాలా ఫాస్టాగ్స్‌కి కేవైసీ జరగడం లేదు. ఇవి ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకం. ఈ నేపథ్యంలో ఆర్బీఐ నిబంధనలకు కట్టుబడి, కేవైసీని పూర్తి చేసుకోవాలని ప్రజలకు చెబుతోంది ఎన్హెచ్ఏఐ. ఒక వేళ కేవైసీని అప్డేట్ చేయకపోతే.. జనవరి 31 తర్వాత నుంచి సంబంధిత ఫాస్టాగ్ అకౌంట్స పని చేయవని స్పష్టం చేసింది.
“అందరు కేవైసీ చేసుకోవాలి. కొత్తగా తీసుకునే ఫాస్టాగ్స్ పనిచేస్తాయి. కేవైసీ జరగని పాత అకౌంట్స్‌ని బ్యాంక్‌లు బ్లాక్ చేస్తాయి,” అని ఎన్హెచ్ఏఐ వెల్లడించింది.
ఫాస్టాగ్ డీయాక్టివేట్ అయితే ఏం అవుతుంది..
టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు, ఆటోమెటిక్‌గా డబ్బులు కట్ అయ్యేందుకు తీసుకొచ్చిన వ్యవస్థే ఈ ఫాస్టాగ్. దేశంలో 8 కోట్ల మందికిపైగా ప్రజలు ఫాస్టాగ్‌ని వాడుకుంటున్నారు. దీని పెనిట్రేషన్ రేట్ 98శాతంగా ఉంది. అయితే.. కొందరు కావాలనే ఫాస్టాగ్‌లను తమ స్క్రీన్‌కి అతికించుకోవడం లేదు. ఫలితంగా జాతీయ రహదారుల్లోని టోల్ ప్లాజాల్లో ఇతరులకు ఇబ్బంది కలుగుతోంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ‘వన్ వెహికిల్, వన్ ఫాస్టాగ్’ని మొదలుపెట్టింది ప్రభుత్వం. వ్యక్తిగత వాహనాలకు ఫాస్టాగ్ ఛార్జీలు ఉండవు. కాకపోతే ఫాస్టాగ్ వాలెట్ బ్యాలెన్స్‌ని మెయిన్టైన్ చేయాలి. ఇది ఒక్కో బ్యాంక్‌కు ఒక్కో విధంగా ఉంటుంది. ఇక భారీ వాహనాలు, బస్సులు, ట్రక్లు ట్రాక్టర్లకు ఫాస్టాగ్ ఛార్జీలు రూ. 100గా ఉంటుంది. ఇందులో రూ.99ని రీఫండ్ అయిపోతుంది. రూ.
జాతీయ రహదారులపై ప్రయాణం కోసం ఫాస్టాగ్ చాలా కీలకంగా మారింది. ఇది లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అందరు తమ కేవైసీని పూర్తి చేసుకోవడం ఉత్తమం. లేకపోతే జనవరి 31 తర్వాత అవి పని చేయవు. ఫాస్టాగ్ వ్యవస్థకు త్వరలోనే ముగింపు పలకాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఫాస్టాగ్ స్థానంలో మరింత ఎఫెక్టివ్ సిస్టెమ్ తీసుకురావాలని చూస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనేకమార్లు తెలిపారు.