నిజామాబాద్ నగర పరిధిలోని కోటగల్లిలో ఉన్న లావణ్య అక్రేడ్ షాపింగ్ కాంప్లెక్స్ లిప్ట్ లో సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయి రెండు గంటల పాటు నరకయాతన అనుభవించాడు. వివరాల్లోకి వెళ్లితే.. వాష్ రూమ్ కి వెళ్లితే లిప్ట్ లో వెళ్లి తిరిగి గ్రౌండ్ ఫ్లోర్ లో దిగేందుకు కాళు బయటపెడుతుండగా లిప్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది.
ఈ నేపథ్యంలో అతని కాళ్లు బయట, బాడీ లోపల ఉండిపోయి అందులోనే ఇరుక్కుపోయాడు. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డు మహేందర్ గౌడ్ కాళ్లు, చేతులు విరిగి కొన ఊపిరితో కొట్టుమిట్టాడాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నిజామాబాద్ ఫైర్ స్టేషన్ లోని రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి గంటన్నర పాటు శ్రమించి బాధితుడిని లిప్ట్ నుంచి బయటికి తీశారు. అనంతరం అతడిని 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.