ఇవాళ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఆసియా కప్ 2023 లో భాగంగా.. ఇవాళ శ్రీలంకలోని పల్లెకేలె వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇక ఇప్పటికే రెండు జట్లు ఈ పోరుకు సిద్ధమయ్యాయి. మొదట టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది.
అయితే.. ఇవాళ టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనున్న పల్లె కెలెలో భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఒకవేళ వర్షం కాసేపు పడి ఆగిపోతే… ఫలితం కోసం ఇరు జట్లు చెరువు 20 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ ఇన్నింగ్స్ ముగియాల్సిన టైం వరకు వర్షం పడుతూనే ఉంటే మ్యాచ్ రద్దు చేసి చెరో పాయింట్ ఇస్తారు. ఒకవేళ ఫస్ట్ ఇన్నింగ్స్ జరిగి రెండో ఇన్నింగ్స్ లో 20 ఓర్ల తర్వాత వర్షం పడితే డక్ వర్త్ లూయిస్ ప్రకారం విజేతను నిర్ణయిస్తారు.