మహారాష్ట్రలో ఎన్డీఏకు షాక్.. ఇండియా కూటమికే జై కొట్టిన ప్రజలు

-

మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడి ప్రజలు ఇండియా కూటమికే జై కొట్టారు. ముఖ్యంగా శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం, ఎన్​సీపీ శరద్‌ పవార్‌ వర్గాలకు ప్రజలు పట్టం కట్టారు. ఆ రాష్ట్రంలో శివసేన, ఎన్​సీపీ పార్టీలు చీలినా ఏక్‌నాథ్‌ శిందే, అజిత్‌ పవార్‌ వైపు కాకుండా ఉద్ధవ్‌ఠాక్రే, శరద్‌ పవార్‌వైపే ఓటర్లు మొగ్గు చూపారు. గత ఎన్నికల్లో 48 స్థానాలకు 41 చోట్ల ఎన్​డీఏ కూటమి జయకేతనం ఎగురవేయగా.. ఈసారి అనుహ్యంగా బీజేపీ తడబడింది. గత రెండు ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైన కాంగ్రెస్‌ ఈసారి డబుల్‌ డిజిట్‌ను అందుకుంది.

మహారాష్ట్రలో మొత్తం 48 ఎంపీ స్థానాలుండగా ఇండియా కూటమి 30 స్థానాల్లో, ఎన్డీఏ కూటమి 17 స్థానాల్లో గెలిచింది. ఒక స్థానాన్ని ఇతరులు సొంతం చేసుకున్నారు. ఇక ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ – 13, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం – 9, ఎన్సీపీ శరద్ పవార్ టీమ్ – 8 సీట్లలో విజయం సా ధించింది. ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 9, శివసేన-7 సీట్లు, ఎన్సీపీ-1 స్థానంలో గెలుపొందాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version