ఇండియాలో గడిచిన 24 గంటల్లో 628 కరోనా కేసులు, ఒకరు మృతి

-

ఇండియాలో కరోనా పాజిటివ్‌ కేసులు కొద్దిగా పెరిగాయి. ఇక గడిచిన 24 గంటల్లో 628 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక తాజాగా నమోదు అయిన కరోనా కేసుల ప్రకారం… దేశవ్యాప్తంగా ప్రస్తుతం 4,054 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా… కొవిడ్ జేఎన్ 1 వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు. లాక్డౌన్ పెట్టకుండానే భారత్ ఈ మహమ్మారిపై పోరాడగలదని చెప్పారు.

మరోవైపు న్యూ వేరియంట్ జేఎన్‌ 1 కోసం అదనపు డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన అవసరం లేదని సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్షియం (ఇన్సాకాగ్‌) అధిపతి డాక్టర్‌ ఎన్‌కే అరోరా తెలిపారు. ఇది వ్యాపించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 60 ఏళ్లు పైబడినవారు, క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నవారు, ఒకటి కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ వేరియంట్తో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దీనికి అదనపు డోస్‌ వ్యాక్సిన్‌ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version