ప్రపంచంలో 2028 నాటికి 3వ ఆర్థిక శక్తిగా భారతదేశం నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. లోక్సభలో మోదీ మాట్లాడుతూ… 1991లో భారత్ అప్పుల కోసం ప్రపంచం వైపు చూసిందని… 2014 తర్వాత స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా నిలవదొక్కుకుందని అన్నారు. తమ పనితీరు, నిబద్ధతతోనే దేశాన్ని మూడో ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టి తీరుతామని మోడీ తేల్చిచెప్పారు.
అటు హైకోర్టు తీర్పు తర్వాత మణిపూర్లో పరిస్థితులు మారాయని చెప్పారు. త్వరలో మణిపూర్లో శాంతి నెలకొంటుందని ప్రజలకు హామీ ఇస్తున్నానని వెల్లడించారు ప్రధాని మోడీ. నిందితులకు కఠిన శిక్ష పడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా కృషి చేస్తున్నాయి. దేశం మీ వెంటే ఉందని అక్కడి ఆడబిడ్డలు, బిడ్డలకు చెప్పాలనుకుంటున్నా. మణిపూర్కు అండగా ఉంటాం’ అని మోదీ భరోసా ఇచ్చారు.