World Cup 2023 : ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా రెడీ

-

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో టీమిండియా అద్భుత విజయాలతో రాణిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్లలో అన్ని గెలిచి రెండవ ప్లేస్ లో ఉంది. దానికి తగ్గట్టుగానే టీమిండియా బ్యాటర్లు అలాగే బౌలర్స్ బాగా రాణించడంతో టీమిండియా మంచి పొజిషన్లో కనిపిస్తోంది. ఇక ఇవాళ మరో రసవత్తర పోరుకు టీమిండియా సిద్ధమైంది.

India vs England, 29th Match

డిపెండింగ్ ఛాంపియన్స్ అయినా ఇంగ్లాండ్ జట్టుతో… టీమిండియా తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజ్పేయి స్టేడియంలో జరగనుంది. ఇక ఎప్పటిలాగే మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇవాళ హార్దిక్ పాండ్యా ఆడడం లేదు. రెండు వారాలు రెస్ట్ ఇవ్వడంతో ఈ మ్యాచ్కు కూడా దూరమయ్యాడు పాండ్యా. అటు ఆడిన ప్రతి మ్యాచ్ ఓడుకుంటూ.. పాయింట్స్ టేబుల్ లో చిట్టచివరన ఇంగ్లాండ్ జట్టు ఉన్న సంగతి తెలిసిందే. మరి అలాంటి జట్టు ఇవాళ ఎలా రాణిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version