నిత్యం శత్రువులో ఘర్షణ వాతావరణం ఏమాత్రం ఏమరు పాటుగా ఉన్నామా.. గంట నక్క పాకిస్థాన్, డ్రాగన్ దేశం చైనా తమ వక్రబుద్ధిని చూపించే అవకాశం ఉంది. మరోవైపు ఎముకలు కొరికే చలిలో ఎప్పటికప్పుడు పహారాకాస్తుంటారు. జమ్ముకాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఇలా హిమాలయాలను ఆనుకుని ఉన్న రాష్ట్రాలను అనుకుని పాకిస్థాన్, చైనాలు ఉన్నాయి. వీటిపై ఓ నజర్ వేయాలంటే.. సముద్రమట్టం నుంచి కొన్ని వేల అడుగుల ఎత్తులో మన సైనికులు పహారా కాయాల్సిందే.
సియాచిన్, కార్గిల్, ద్రాస్ సెక్టార్, హిమాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో 15 వేల అడుగుల ఎత్తులో సైన్యం మన బార్డర్లను రక్షిస్తూ.. శత్రువులపై కన్నేసి ఉంచుతుంది. అటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్న మన సైన్యానికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది భారత సైన్యం. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సిబ్బంది ఉత్తరాఖండ్ హిమాలయాల చుట్టూ 15,000 అడుగుల ఎత్తులో గడ్డకట్టించే తక్కువ ఉష్ణోగ్రతలలో మంచుతో కప్పబడిన ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న ఓ వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోను చూస్తే.. బార్డర్లో మన సైనికులు ఎలాంటి విధులు నిర్వర్తిస్తున్నారో.. ఎంత కష్టపడుతున్నారో అర్థం అవుతుంది.
#WATCH | Indo-Tibetan Border Police (ITBP) personnel patrolling in a snow-bound area at 15,000 feet in sub-zero temperatures around in Uttarakhand Himalayas. pic.twitter.com/9IobbXquEj
— ANI (@ANI) February 17, 2022