దేశవ్యాప్తంగా ఇవాళ (జూన్ 16వ తేదీ 2024) ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2024 ప్రాథమిక పరీక్ష జరగనుంది. మొత్తం 1,056 ఉద్యోగాలు ఉండగా ప్రిలిమ్స్‌కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు పేపర్-2 నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభానికి అర గంట ముందుగానే అన్ని కేంద్రాల గేట్లు మూసివేస్తారు. నిరుటి వరకు 10 నిమిషాల ముందు గేట్లు మూసి వేసేవారు. ప్రతి కేంద్రం వద్ద జామర్లు ఏర్పాటు చేశారు.
ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో తెలంగాణ నుంచి 49,883 మంది ఉన్నారు. హైదరాబాద్‌లో 45,153 మందికి 99 పరీక్ష కేంద్రాలను, వరంగల్‌లో 4,730 మందికి 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రిలిమ్స్ పరీక్షకు ప్రతి ఏడాది పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నా వారిలో సగం మందే పరీక్ష రాస్తున్నట్లు యూపీఎస్‌సీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.