పశ్చిమ ఆఫ్రికా ఘోర ప్రమాదం జరిగి.. 42 మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ ఆఫ్రికా దేశం తూర్పు మాలిలో ఓ బంగారు గని కుప్పకూలి 42 మంది మృతి చెందినట్టు సమాచారం అందుతోంది.

నెల రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. చైనా దేశస్తుల నిర్వహణలో ఉన్న గనిలో 42 మంది మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు వెల్లడించారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.