ఇంటర్నెట్ వాడకంలో దూసుకెళ్తున్న భారత్

-

ఈ కాలంలో చేతిలో మొబైల్.. అందులో ఇంటర్నెట్​ లేని వారంటూ ఎవరూ లేరు. పూటకు తిండి లేకపోయినా చేతిలో మొబైల్ మాత్రం కంపల్సరీ అయిపోయింది ఇప్పుడు. ఇక ఇంటర్నెట్ వాడకం మామూలుగా ఉండడం లేదు. అందుకే ఇంటర్నెట్‌ వినియోగంలో భారత్‌ దూసుకెళ్తోంది.

2022 నాటికి దేశ జనాభాలో 50 శాతానికిపైగా నగర, గ్రామీణ ప్రాంత ప్రజలు కలిపి నెలలో కనీసం ఒకసారైనా ఇంటర్నెట్‌ వాడుతున్నట్లు ఓ నివేదికలో వెల్లడించింది. దేశ జనాభాలో సగానికి పైగా అంతర్జాలాన్ని వినియోగించడం ఇదే మొదటిసారి. భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగంపై ఇంటర్నెట్‌ ఇన్‌ ఇండియా-2022 పేరిట ఐఏఎంఏఐ, కాంటార్‌ సంస్థలు ఈ మేరకు నివేదిక రూపొందించాయి.

ఇంటర్నెట్‌ వాడకదారుల సంఖ్య 2025 నాటికి 90 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశాయి. మొత్తం 75.9 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 39.9 కోట్ల మంది గ్రామీణ, 36 కోట్ల మంది పట్టణాలకు చెందినవారు ఉన్నారు. 2025 నాటికి దేశంలోని కొత్త ఇంటర్నెట్ వినియోగదారుల్లో 56 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే ఉంటారని అంచనా.

Read more RELATED
Recommended to you

Exit mobile version