ఈరోజుల్లో చాలా మంది వారికి నచ్చిన పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇలా డబ్బులు పెడితే మంచిగా లాభం ఉంటుంది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు, అవసరాలు వేగంగా మారిపోతున్నాయి. అందుకని భవిష్యత్తులో ఎదురయ్యే అత్యవసరాలు ఎదుర్కోవాలంటే ఆర్థిక ప్రణాళిక అవసరం. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా స్కీమ్స్ ని అందిస్తోంది. డబ్బు పొదుపు చేసుకునే అవకాశం తో పాటు ఆర్థిక భద్రత కూడా ఈ స్కీముల వలన కలుగుతుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. లైఫ్ ఇన్సూరెన్స్ అందించే స్కీమ్స్ లో ఎల్‌ఐసీ బీమా రత్న స్కీమ్ కూడా ఒకటి.
ఈ నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తో సూపర్ బెనిఫిట్స్ ని పొందొచ్చు. మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్-ఇయర్లీ, యాన్యువల్లీ ప్రీమియంలు ఈ ప్లాన్ లో చెల్లించచ్చు. పాలసీదారులు తమ ప్రీమియంలపై యాన్యువల్ పేమెంట్స్‌పై 2% వరకు, హాఫ్ ఇయర్లీ పేమెంట్స్‌పై 1% వరకు తగ్గింపు పొందొచ్చు. అదనంగా బేసిక్ సమ్ అష్యూర్డ్ ఎక్కువగా ఉన్నట్టయితే ట్యాబులర్ ప్రీమియంపై రాయితీని పొందవచ్చు. పాలసీ ల్యాప్స్ అయితే మొదటి ప్రీమియం చెల్లింపు నుంచి ఐదేళ్ల లోపు దాన్ని పునరుద్ధరించుకునే ఛాన్స్ ఉంటుంది.
రెండేళ్ల కంటే తక్కువ ప్రీమియంలు చెల్లించినట్టైతే గ్రేస్ పీరియడ్ తర్వాత పాలసీ ఎండ్ అవుతుంది. రెండు సంవత్సరాల పాటు ప్రీమియంలను కనుక పే చేస్తే పాలసీని సరెండర్ చేసే సదుపాయం ఉంటుంది. అంతే కాదు పాలసీ యాక్టివ్‌గా ఉన్నప్పుడు పాలసీదారు మరణిస్తే డబ్బులు వస్తాయి. కుటుంబానికి అష్యూర్డ్ డెత్ బెనిఫిట్, అదనపు మొత్తం కలిసి ఇస్తారు. ప్రతీ సంవత్సరం చెల్లించే ప్రీమియంకు ఏడు రెట్లు లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్ లో 125% ఏది ఎక్కువైతే అది అందజేస్తారు. పాలసీదారు తప్పనిసరిగా కనీసం బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షలు ని ఎంపిక చేస్తే బీమా రత్న ప్లాన్‌కు అర్హత లభిస్తుంది.
పాలసీ వ్యవధి 15, 20 లేదా 25 సంవత్సరాలు ఉంటుంది. 15 సంవత్సరాల పాలసీలకు 11 సంవత్సరాలు, 20 సంవత్సరాల పాలసీలకు 16 సంవత్సరాలు, 25 సంవత్సరాల పాలసీలకు పూర్తిగా పాలసీ వ్యవధి ఉంటుంది. బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.10 లక్షలతో, యాన్యువల్లీ రూ.50 వేలు చొప్పున ఈ ప్లాన్ ని కనుక తీసుకుని ఇరవై ఏళ్ళు ఇన్వెస్ట్ చేసి… పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే డెత్ బెనిఫిట్ రూ.23,05,000 అందుతుంది. రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూర్డ్, రూ.12.5 లక్షలు (బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 125%), గ్యారెంటీడ్ అడిషన్స్ రూ.55,000 ఉంటుంది. అదే జీవించి ఉంటే మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.5,55,000 గా వుంది. ఇందులో రూ.5 లక్షలు (బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 50%), గ్యారెంటీడ్ అడిషన్స్ రూ.55,000.