నలుగురు బందీల విడుదల ఇజ్రాయెల్ ఆపరేషన్.. 274 మంది పాలస్తీనియన్లు మృతి

-

సెంట్రల్‌ గాజాలో శనివారం రోజున నలుగురు బందీల విడుదల కోసం ఇజ్రాయెల్‌ చేపట్టిన ఆపరేషన్‌ 274 మంది పాలస్తీనియన్ల ప్రాణాలు బలి తీసుకుంది. ఈ ఆపరేషన్లో దాదాపు 700 మంది గాయాల పాలయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. ఈ విషయాన్ని గాజా పాలస్తీనా ఆరోగ్య విభాగం వెల్లడించింది. తొలుత ఈ ఆపరేషన్‌లో 100 మంది చనిపోయారని ఇజ్రాయెల్‌ పేర్కొనగా.. కొన్ని గంటల్లోనే మృతుల సంఖ్య 274కు చేరింది.

ఆదివారం సెంట్రల్‌ గాజాలోని నుసీరాత్‌ శరణార్థి శిబిరంలోని రెండు వేర్వేరు ప్రదేశాలపై దాడి చేసి హమాస్‌ చెరలోని నలుగురు బందీలను ఇజ్రాయల్‌ ప్రత్యేక దళాలు రక్షించాయి. ఈ క్రమంలోనే భారీగా ప్రాణనష్టం సంభవించింది. బందీలను రక్షించే సమయంలో బలగాలపై భారీఎత్తున దాడులు జరిగాయని ఇజ్రాయెల్‌ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ తెలిపారు. ఇజ్రాయెల్ తీరుపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు గాజా-ఇజ్రాయెల్‌ యుద్ధం ముగించాలని, టెల్‌అవీవ్‌కు అగ్రరాజ్యం మద్దతు ఆపేయాలంటూ అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధ పరిసరాలు నిరసనలతో దద్దరిల్లాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version