భారత ప్లేయర్లు తల ఎత్తుకోండని కోరారు దిగ్గజ ప్లేయర్ కపిల్ దేవ్. వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓటమిపై దిగ్గజ ప్లేయర్ కపిల్ దేవ్ కీలక వాక్యాలు చేశారు. ‘మీ ప్రదర్శన పట్ల దేశం హర్షిస్తోంది. ఛాంపియన్స్ లా ఆడారు. సగర్వంగా తల ఎత్తుకోండి. మీ మెదడులో ట్రోఫీ తప్ప మరో ఆలోచన లేదు. మీరు ఎప్పుడో విజేతలుగా నిలిచారు.
మిమ్మల్ని చూసి ఈ దేశం గర్విస్తోంది. ఇది కష్టకాలమని నాకు తెలుసు. స్ఫూర్తిని కోల్పోవద్దు. యావత్ భారత్ మీకు మద్దతుగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. ఇక అటు వరల్డ్ కప్ ఓటమి తర్వాత భారతజట్టు భావిద్వేగానికి లోనవగా…. వారిని ఓదార్చేందుకు ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లారు. ముందుగా కెప్టెన్ రోహిత్, కోహ్లీతో మోదీ మాట్లాడి భుజం తడుతూ వారిలో ధైర్యాన్ని నింపారు. ఆటలో గెలుపు ఓటములు సహజం…. మీరు పోరాడారంటూ టీమును అభినందించారు. ‘రాహుల్ ఎలా ఉన్నావు’ అంటూ ద్రవిడ్ ను పలకరించిన మోదీ…. చాలా బాగా ఆడావు అంటూ షమీని హత్తుకున్న వీడియోను బీసీసీఐ తాజాగా రిలీజ్ చేసింది.