మూవీ టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌పై 2% టాక్స్.. సర్కార్ నిర్ణయంపై ఫిలిం ఛాంబర్‌ ఫైర్

-

సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ఫీజుపై కర్ణాటక ప్రభుత్వం 2శాతం పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇప్పటికే అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న ఇండస్ట్రీని ఇది మరింత కష్టాల్లోకి నెడుతుందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 637 థియేటర్లు ఉండగా వాటిలో దాదాపు 130 మూసివేతకు దగ్గరగా ఉన్నాయని అధ్యక్షుడు ఎన్‌.ఎం సురేశ్‌ అన్నారు. థియేటర్‌కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మరిన్ని సవాళ్లను మోసుకొస్తుందని.. ఈ నేపథ్యంలో ఈ విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి మరోసారి చర్చిస్తామని తెలిపారు.

జులై 23న ఇందుకు సంబంధించిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కౌన్సిల్‌ కూడా ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక గవర్నర్ ఆమోదముద్రే తరువాయి. కన్నడ చిత్రాల విషయంలోనైనా సహకరించమని సీఎం సిద్ధరామయ్యను కోరామని ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు సురేశ్‌ అన్నారు. ఇంటికి వచ్చిన కలిసేందుకు సీఎం అనుమతి ఇచ్చారని.. పన్ను విషయంతో పాటు, థియేటర్‌ల సమస్యలు, కన్నడ చిత్రాలకు రాయితీలు ఇలా అనేక విషయాలు చర్చిస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version