బీజేపీ ఆదేశాల మేరకే ఈడీ నోటీసులు: కేజ్రీవాల్

-

బీజేపీ ఆదేశాల మేరకే ఈడీ నోటీసులు ఇచ్చారని ఆరోపణలు చేశారు ఢీల్లీ సీఎం కేజ్రీవాల్. ఇక్కడ స్కామ్ కేసులో తనకు ఈడి నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్ధమని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ‘బీజేపీ ఆదేశాల మేరకే అధికారులు నోటీసులు పంపారు. త్వరలో జరగబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకునేందుకే ఇలా చేశారు.

నోటీసులను ఈడి వెనక్కు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. కాగా, ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన ఈడీ ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాగా దిల్లీ లిక్కర్ స్కామ్​లో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురిని ఈ కేసులో అరెస్టు చేసి విచారిస్తున్నారు. విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలతో మరికొందరికి నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ కేసు ఉచ్చు దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ చుట్టూ బిగిస్తున్నట్లు కనిపిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version