ముంబయిలో 2008లో జరిగిన ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణా ఇటీవల భారత్కు చేరుకున్న విషయం తెలిసిందే. అమెరికా నుంచి ఇండియాకు తీసుకువచ్చిన రాణాను భారత్ లో అడుగుపెట్టగానే జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాణాను విచారించి రిమాండ్ రిపోర్టు రూపొందించారు. ఈ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
అంతర్జాతీయ స్థాయిలో ముంబయి పేలుళ్ల కుట్ర లింకులు బయటపడినట్లు ఎన్ఐఏ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఢిల్లీ, అనేక నగరాలను టార్గెట్‌గా చేసుకున్నారని తెలిపింది. ఇందులో ఇంకా ఎవరెవరు భాగమయ్యారు.. ఇంకా ఎక్కడెక్కడ కుట్ర పన్నారు.. వంటి పలు కీలక విషయాలు తెలియాలంటే రాణా సహచరులను దర్యాప్తు చేయడం అవసరం ఇని పేర్కొంది. ఈ నేపథ్యంలో తహవూర్ రాణాను విచారించేందుకు కోర్టు అంగీకరించినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.