కిరణ్‌ రిజిజుపై.. వేటు పడింది అందుకేనా..?

-

కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన కిరణ్‌ రిజిజును ఆ బాధ్యతలనుంచి తప్పించి.. భూ విజ్ఞానశాస్త్ర శాఖ మంత్రిగా కేంద్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. అయితే, కిరణ్‌ను తప్పించడానికి కారణాలు ఏమైనా.. ఆయన న్యాయవ్యవస్థపై చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణమవుతున్నాయి.

ముఖ్యంగా న్యాయవ్యవస్థలో నియామకాల కోసం అనుసరించే కొలీజియం వ్యవస్థతోపాటు కోర్టు వ్యవహారాల్లో పారదర్శకతపై ఆయన చేసిన వ్యాఖ్యలు కొంతకాలంగా చర్చనీయాంశమవుతున్నాయి. న్యాయవ్యవస్థపై బహిరంగంగా విమర్శలు కొనసాగిస్తున్న  నేపథ్యంలోనే ఆయనపై వేటుపడినట్లు తెలుస్తోంది.

న్యాయమూర్తుల నియామకాన్ని చేపట్టే కొలీజియం వ్యవస్థపై మాట్లాడిన ఆయన.. ఆ వ్యవస్థలో పారదర్శకత లేదని సంచలన ఆరోపణలు చేశారు. న్యాయవ్యవస్థకు లేదా న్యాయమూర్తులకు తాను వ్యతిరేకం కాదన్న ఆయన.. ఇలాంటి భావన ప్రజల్లో ఉందని చెప్పారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వ పాత్ర తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు కిరణ్‌ రిజిజు లేఖ కూడా రాయడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version