కేంద్రమంత్రి వర్గంలో భారీ మార్పు చోటుచేసుకుంది. న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజును ఆ బాధ్యతల నుంచి కేంద్రం తొలగించింది. ఆ శాఖ బాధ్యతలను కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్‌మేఘ్వాల్‌కు అప్పగించింది. 14 ఏళ్లకే వివాహం చేసుకొని, ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన అర్జున్ మోఘ్వాల్ న్యాయశాఖ మంత్రిగా ఎదిగిన తీరున ఓ సారి చూద్దామా..?
మేఘ్వాల్.. రాజస్థాన్‌లోని బికనేర్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. 14 ఏళ్ల వయసులోనే ఆయనకు పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత ఆయన ఉన్నత విద్య కొనసాగించారు. బీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎంఏ, ఎంబీఏ పట్టాలు పొందారు. 1999లో రాజస్థాన్ క్యాడర్‌లో ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. తర్వాత ఆయన మనసు రాజకీయాలవైపు మళ్లింది.
2009లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి లోక్‌సభలో అడుగుపెట్టారు. పార్లమెంట్ సభ్యుడిగా పలు కమిటీల్లో భాగమయ్యారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, లోక్‌సభలో చీఫ్ విప్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. మేఘ్వాల్.. తాను పనిచేసే ప్రదేశానికి సైకిల్ మీద వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడతారు. పలుమార్లు లోక్‌సభకు అలాగే వచ్చారు. 2016లో కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి భద్రతా కారణాల దృష్యా సైకిల్‌పై రావడంలేదు. ప్రస్తుతం ఆయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.