జీఎస్టీ లోటు కోసం లక్ష కోట్ల అప్పు…!

-

జీఎస్టీ వసూళ్ల కొరతను తీర్చడానికి గానూ కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం రాష్ట్రాల తరఫున 1.10 లక్షల కోట్ల రూపాయల వరకు రుణాలు తీసుకుంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జీఎస్టీ పరిహార సెస్ విడుదలకు బదులుగా అప్పుగా తీసుకున్న మొత్తాన్ని బ్యాక్-టు-బ్యాక్ లోన్‌గా రాష్ట్రాలకు అందజేస్తామని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

రుణాలు తీసుకోవడం ద్వారా… భారత ఆర్థిక లోటుపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది. ఈ అప్పులు రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుందని చెప్పింది. రాష్ట్రాలు తమ రాష్ట్ర అభివృద్ధికి ఈ రుణాలు ఉపయోగపడతాయని కేంద్రం పేర్కొంది. ఆత్మా నిర్భర్ ప్యాకేజీ కింద స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో 2 శాతం అదనపు రుణాలు తీసుకునే సదుపాయం కల్పించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version