నేడు పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం

-

గత వారం వాయిదా పడిన పార్లమెంట్‌ సమావేశాలు తిరిగి ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ సభ ప్రారంభం కాగానే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర మాజీమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ధన్యవాద తీర్మానంపై చర్చకు లోక్‌సభ 16 గంటల సమయాన్ని కేటాయించింది. ఈ సభలో ప్రతిపక్షాలు నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీ, నిరుద్యోగం అంశాలు లేవనెత్తనున్నాయి. అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలు అంశాలపై చర్చకు పట్టుపట్టనున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలు సోమవారం పార్లమెంటులో దుమారం రేకెత్తించే అవకాశాలున్నాయి. గతవారం వాయిదాపడిన సభలు పునఃప్రారంభం కాగానే విపక్షాలు దీనిపై ఆందోళన వినిపించేందుకు సన్నద్ధంగా ఉన్నాయి. ఇక గత వారం పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. దేశ చరిత్రలో దాదాపు 4 దశాబ్దాల తర్వాత మొదటి సారిగా స్పీకర్ ఎన్నిక నిర్వహించాల్సి వచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version