ఇటీవలే హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఎన్నికలు విజయవంతంగా జరిగాయని ఎన్నికల కమిష
నర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ లో ఎలాంటి హింస జరుగకుండా ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో 36 జిల్లాలు 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నవంబర్ 26న అసెంబ్లీ ఎన్నికల గడువు ముగియనుంది. మహారాష్ట్ర 9.63కోట్ల ఓటర్లున్నారు.
అదేవిధంగా జార్ఖండ్ లో 81 అసెంబ్లీ స్థానాలుండగా.. జార్కండ్ లో మొత్తం ఓటర్లు 2.6 ఓటర్లున్నారు. జనవరి 05, 2025తో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల గడువు ముగియనుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను తాజాగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. జమ్మూకాశ్మీర్, హర్యానా ఎన్నికల మాదిరిగానే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా జరిగేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహారాష్ట్ర నోటిఫికేషన్ అక్టోబర్ 22, 2024 విడుదల కానుంది. నామినేషన్ గడువు తేదీ అక్టోబర్ 29, 2024. అక్టోబర్ 30న స్క్రూట్నీ. ఒకేదశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 04న నామినేషన్లు ఉపసంహరణకు చివరి తేదీ. నవంబర్ 20న ఎన్నికలు జరుగనున్నాయి.