ఉత్తర్ ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఐదుగురి అతి కిరాతకండా నరికి చంపాడు ఓ యువకుడు. అనంతరం తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మైన్పురి జిల్లాలోని గోకుల్పుర్లో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోకుల్పుర్కు చెందిన శివవీర్ యాదవ్(30).. తన సోదరులు భుల్లన్ యాదవ్(25), సోనూ యాదవ్(21), సోనూ భార్య సోనీ(20), బావ సౌరభ్(23), స్నేహితుడు దీపక్(20)ను గొడ్డలితో నరికి చంపేశాడు. వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం భార్య డాలీ, మేనత్తపై దాడికి పాల్పడి.. తనను తాను గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో గాయపడ్డ మేనత్త, భార్యను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మిగతా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. శివవీర్ ఎందుకు ఈ హత్యలకు పాల్పడ్డాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందరూ నిద్రిస్తుండగా నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెప్పారు.