ఇండియా కూటమి భేటీపై మమతాబెనర్జీ సంచలన వ్యాఖ్యలు

-

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో ఇండియా కూటమి కాస్త బీటలు వారింది. ఈ ఓటమిపై కూటమి పక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ దిల్లీ వేదికగా కూటమి భేటీ అయింది. అయితే ఈ సమావేశం గురించి తనకు తెలియదంటూ పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఇవాళ దిల్లీలో ఇండియా కూటమి భేటీ అయింది. అయితే ఈ సమావేశం గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని మమతా బెనర్జీ అన్నారు. అందుకే తాను బెంగాల్​లో మరో కార్యక్రమానికి హాజరవుతున్నానని తెలిపారు. ముందే తెలిసి ఉంటే అక్కడికే వెళ్లేదాన్ని చెప్పుకొచ్చారు.

మరోవైపు బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్ కూడా ఈ కూటమి సమావేశానికి హాజరుకానట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో మరో నేత వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండియా కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్​కు ఈ బాధ్యతలు ఇస్తే భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతాయని, అందువల్ల సారథ్య బాధ్యతలను తమ నేత నీతీశ్‌కుమార్‌కు అప్పగించాలని జేడీయూ కీలక వ్యాఖ్యలు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version