మెదక్ లో యువతిని పెట్రోల్ పోసి కాల్చివేసిన దుండగులు

-

మెదక్ లో యువతిని పెట్రోల్ పోసి కాల్చివేశారు దుండగులు. ఈ సంఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా వడియారంలో యువతి దారుణ హత్య జరిగింది. 25 ఏళ్ల యువతిని హత్య చేసి పెట్రోల్ పోసి కాల్చివేశారు కొంత మంది దుండగులు.

The miscreants who doused the young woman with petrol and set her ablaze in Medak

హైదరాబాద్ వెళ్లే రహదారి పక్కన సగం కాలిన స్థితిలో యువతి మృతదేహం పడి ఉంది. వేరే ప్రాంతంలో యువతిని హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతి ఒంటిపై ఒంటిపై కాషాయ రంగు టా ప్, ఎరుపు లెగ్గిన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version