మేరా బిల్ మేరా అధికార్ : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బంపర్‌ ఆఫర్‌.. షాపింగ్‌ చేస్తే కోటి రూపాయలు గెలవచ్చు

-

షాపింగ్‌ అంటే నచ్చని వాళ్లు ఎవరూ ఉండరు. మూడ్‌ బాలేకున్నా షాపింగ్‌ చేస్తే చాలు.. కొత్త ఉత్సాహం వస్తుంది. కానీ పైసలన్నీ ఖర్చుచేసుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. అందుకే చాలా మంది దడుస్తుంటారు. భారత ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఓ గుడ్‌న్యూస్‌ ప్రకటించింది. లక్కీ డ్రాలో ఏకంగా రూ.కోటి క్యాష్ ప్రైజ్ గెలుపొందే సువర్ణావకాశాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి ‘మేరా బిల్ మేరా అధికార్’ పేరిట ఓ ఇన్‌వాయిస్ ఇన్సెంటివ్‌ స్కీమ్‌ను అమలు చేయనుంది.

ఈ పథకం కింద రూ.200 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఏదైనా వస్తువులు లేదా సర్వీస్‌ల GST ఇన్‌వాయిస్‌లను అప్‌లోడ్ చేయడం ద్వారా రూ.కోటి వరకు క్యాష్ ప్రైజ్ గెలుచుకునే ఛాన్స్ కొట్టేయవచ్చు. ప్రజలు ఏవైనా వస్తువులు కొనుగోళ్లు చేసినప్పుడు ఇన్‌వాయిస్‌లను అడిగేలా ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

వ్యాపార సంస్థలు GST సరైన మొత్తాన్ని చెల్లిస్తున్నాయని, GST సిస్టమ్ ప్రయోజనాలను సామాన్యులు పొందుతున్నారని నిర్ధారించుకోవడానికి కూడా ఈ స్కీమ్‌ను తీసుకొచ్చారు. ఈ పథకం మొదటగా అస్సాం, గుజరాత్, హర్యానా, కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, డామన్ & డయ్యూలలో అమల్లోకి వస్తుంది. తరువాత దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తారు.

ఏ ఇన్‌వాయిస్‌లు, ఎలా అప్‌లోడ్ చేయాలి?

లక్కీ డ్రాకు అర్హత పొందడానికి అస్సాం, గుజరాత్, హర్యానా, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, డామన్ & డయ్యూలలో GST-రిజిస్టర్డ్ సప్లయర్లు ఇచ్చిన ఇన్‌వాయిస్‌లను మాత్రమే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా వేరేవి అప్‌లోడ్ చేస్తే లక్కీ డ్రాకు అర్హత లభించదు. లక్కీ డ్రాకు ఎలిజిబుల్ కావడానికి అప్‌లోడ్ చేసే ఇన్‌వాయిస్ కనీస విలువ రూ.200 ఉండాలి.

‘మేరా బిల్ మేరా అధికార్’ మొబైల్ యాప్ లేదా వెబ్ పోర్టల్‌ (web.merabill.gst.gov.in)లో GST ఇన్‌వాయిస్‌లను అప్‌లోడ్ చేయవచ్చు. ఒక నెలలో గరిష్ఠంగా 25 ఇన్‌వాయిస్‌లను అప్‌లోడ్ చేసుకోవచ్చు. అప్‌లోడ్ చేసిన ప్రతి ఇన్‌వాయిస్ కోసం, ఒక అక్నాలెడ్జ్‌మెంట్ రిఫరెన్స్ నంబర్ (ARN) జనరేట్ అవుతుంది, దీనినే క్యాష్ ప్రైజ్‌ డ్రా కోసం ఉపయోగిస్తారు.

గత నెలలో జారీ చేసిన అన్ని B2C ఇన్‌వాయిస్‌లు వచ్చే నెల 5వ తేదీలోపు మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తే అవి మంత్లీ డ్రాకు అర్హత పొందుతాయి. ఇన్‌వాయిస్‌ను అప్‌లోడ్ చేసే సమయంలో సప్లయర్‌కు సంబంధించిన GSTIN, ఇన్‌వాయిస్ నంబర్, ఇన్‌వాయిస్ డేట్, ఇన్‌వాయిస్ వాల్యూ, కస్టమర్ రాష్ట్రం/UT వివరాలు అందించాలి. ఇన్‌యాక్టివ్ లేదా ఫేక్ GSTINతో చేసే ఫేక్ అప్‌లోడ్స్‌, ఇన్‌వాయిస్‌లను లక్కీ డ్రా సిస్టమ్ రిజెక్ట్ చేస్తుంది.

డ్రా ఎలా తీస్తారు..

రేపే ప్రారంభం కానున్న ఈ స్కీమ్ కింద మంత్లీ, క్వార్టర్లీ కాలవ్యవధుల్లో లక్కీ డ్రాలు నిర్వహిస్తారు. మంత్లీ డ్రాలో 800 మందిని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి రూ.10,000 క్యాష్ ప్రైజ్ అందిస్తారు. మరో 10 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు నగదు బహుమతిని అందజేస్తారు. త్రైమాసిక బంపర్ డ్రా (Quarterly bumper draw)లో ఇద్దరు వ్యక్తులు సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి రూ.1 కోటి క్యాష్ ప్రైజ్ ఇస్తారు.

విజేతలకు యాప్ లేదా వెబ్ పోర్టల్‌లో SMS లేదా పుష్ నోటిఫికేషన్ ద్వారా ఆ విషయం తెలియజేస్తారు. విజేతలు సమాచారం అందిన 30 రోజుల్లోగా పాన్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలను అందించాలి. ఈ పైలట్ పథకం 12 నెలల పాటు అమలులో ఉంటుందట.. అదృష్టవంతులు ఎవరో.. ఇక తెలియాల్సి ఉంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version