ఏసీబీ కోర్టులో ఉత్కంఠ.. మళ్లీ కోర్టుకు చందబ్రాబు లాయర్‌

-

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిలా లభిస్తుందా లేక రిమాండ్ విధిస్తారా అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఉదయం నుండి దాదాపు ఏడున్నర గంటలకు పైగా చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు తరుఫున సిద్ధార్థ్ లూథ్రా, సీఐడీ తరుఫున అదనపు ఏజీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఉదయం నుండి సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ జడ్జి.. తీర్పు రిజర్వ్‌లో పెట్టారు.

తన క్లైంట్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమైన చర్యేనని, ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసిందన్నారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ పూర్తి అయిందని, తీర్పు రిజర్వు చేశారని, ఆ కేసులో ఉన్నవారంతా ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారన్నారు. తన క్లైంట్ ను నంద్యాల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నా అలా చేయలేదని, వారు అనుకున్నచోటే ప్రవేశపెట్టారన్నారు. సెక్షన్ 409 చంద్రబాబుకు వర్తించదని, ఈ కేసులో ఏ35 భాస్కర ప్రసాద్ ను అరెస్ట్ చేసినందన చంద్రబాబు అరెస్ట్ అవసరంలేదన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version