27 ఏళ్ల తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు వేదికగా భారత్‌

-

27 ఏళ్ల తర్వాత.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మిస్ వరల్డ్ ఎంపిక పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 1996లో ఈ అంతర్జాతీయ పోటీలకు భారత్‌ వేదికగా నిలిచింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ అవకాశం ఇండియాకు వచ్చింది. 71వ ప్రపంచ సుందరి – 2023 ఫైనల్‌ పోటీలు వచ్చే నవంబరు నెలలో ఇక్కడ జరగనున్నాయి. తుది తేదీలు ఇంకా ఖరారు కాలేదు. మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఛైర్‌పర్సన్‌, సీఈవో జులియా మోర్లే ఈ విషయాన్ని ప్రకటించారు.

‘‘130 దేశాల జాతీయ ఛాంపియన్లు అద్భుతమైన భారతదేశంలో నెల రోజులు విడిది చేస్తారు. పలు ప్రతిభా ప్రదర్శనలు, క్రీడల సవాళ్లు, సేవా కార్యక్రమాలతో ఈ పోటీలు కొనసాగుతాయి. మార్పునకు రాయబారులుగా నిలిచే పోటీదారుల ప్రత్యేకతలను ప్రదర్శించడమే వీటి ఉద్దేశం’’ అని వివరించారు. ‘‘గొప్ప ఆతిథ్యానికి, విలువలకు ప్రతిరూపమైన ఈ అందమైన దేశంలో నా కిరీటాన్ని తదుపరి విజేతకు అందించేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా’’ అని భారత్‌కు వచ్చిన గతేడాది ప్రపంచ సుందరి విజేత కరోలినా బియెలావ్‌స్కా (పోలండ్‌) అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version